Ramcharan Jani Master couple : చరణ్ బర్త్ డే సందర్భంగా సతీసమేతంగా రక్తదానం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దంపతులు


Ramcharan Birthday Jani master couple blood donation : ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రామ్ చరణ్ యువత సహకారంతో నెల్లూరు రామ్ చరణ్ యువత ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీ సమేతంగా విచ్చేసి రక్తదానం చేశారు.

సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ వల్లనే తాను రోజు పొజిషన్ లో ఉన్నాను.. తన కెరీర్ పరంగా ఎంతో సహాయం చేసింది రామ్ చరణ్ గారేనని, పలు సందర్భాల్లో ఆయన తమకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ నిండు నూరేళ్లకంటే ఎక్కువ సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని జానీ మాస్టర్ ఆకాంక్షించారు.

ఆయన సతీమణి మాట్లాడుతూ.. తన డెలివరీ సందర్భంలో కూడా రాంచరణ్ చూపించిన జాగ్రత్త మరిచిపోలేనని రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని జానీమాస్టర్ భార్య అన్నారు. చరణ్ జన్మదిన సందర్భంగా రోజు రక్తదానం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇది తమకెంతో సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు.

close